- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Amarnath: ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: అతి త్వరలో విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మరోసారి స్పష్టం చేశారు. అటు సీఎం జగన్ కూడా వచ్చే విద్యా సంవత్సరంలోనే విశాఖకు వస్తారని ఆయన తెలిపారు. సీఎం జగన్ విశాఖ వచ్చే సమయం నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసిందని ఆయన పేర్నొన్నారు.
కాగా సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని చెబుతున్నారు. ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్‌లోనూ అదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని తెలిపారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను, వ్యాపారవేత్తలను ఆయన కోరారు. దీంతో ఆ పార్టీ నాయకులు కూడా విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ అయ్యే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు. ఏపీకి అమరావతి ఒకటే రాజధాని అయితే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరగదని.. వికేంద్రీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ వైపు కసరత్తులు చేస్తున్నారు.