Visakha: ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు.. ఎందుకంటే..!

by srinivas |   ( Updated:2023-11-24 16:32:32.0  )
Visakha: ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు.. ఎందుకంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ నుంచి పరిపాలన చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతి నుంచి సీఎం జగన్ విశాఖ వస్తున్నారని తెలిపారు. ఆయన వస్తుంటే ప్రతిపక్షాలకు వచ్చిన అభ్యతరాలేంటో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సీఎం పాలించొచ్చని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్టులని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వారు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.


అమరావతి అనే భ్రమను ప్రజల్లో ఇంకా ఉంచాలన్నదే చంద్రబాబు, పవన్ ప్రయత్నమని చెప్పారు. సీఎం జగన్ విశాఖ వస్తుంటే అమరావతిలో వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పోతాయనే భయం వారిలో ఉందని విమర్శించారు. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్ర నుంచి ఉత్తమ ఆంధ్రగా తయారు చేసేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed