- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
visakha: మరో వివాదస్పద భూములను పరిశీలించిన పవన్.. వైసీపీ నేతలు కబ్జా చేశారని తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్:జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ, వివాదాస్పద, భూములను ఆయన పరిశీలిస్తున్నారు. శుక్రవారం రుషికొండ వద్ద జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించారు. అక్రమణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలుచేశారు. తాజాగా మరో వివాదాస్పద భూములను ఆయన పరిశీలిచారు. సిరిపురం జంక్షన్ దగ్గర సీబీసీఎన్‌సీ భూములను పవన్ కల్యాణ్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ CBCNC భూములపై తప్పుడు జీవోలు జారీ చేశారని మండిపడ్డారు. ఐదెకరాల భూమిని వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రైస్తవ సంఘాల భూములను సైతం కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
‘ప్రశాంతమైన విశాఖలో గొడవలు సృష్టిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇలాగే దోపిడీ చేశారు. అందుకే తన్ని తరిమేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. విశాఖ నుంచి పారిపోతామని విశాఖ ఎంపీ చెప్పడం సిగ్గుచేటు. విశాఖ ప్రజలు ఓటేస్తేనే ఎంవీపీ ఎంపీ అయ్యారు. ఎక్కడికో వెళ్లి వ్యాపారాలు చేస్తామనడం దారుణం. తెలంగాణ కోసం ఉస్మానియా విద్యార్థులు నిలబడ్డట్లు..ఏపీ కోసం యువత, ఏయూ వర్సిటీ విద్యార్థులు నిలబడాలి.’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.