మద్యపాన నిషేధం..సీపీఎస్ రద్దు లేకుండా మేనిఫెస్టోనా?:జనసేన నేత

by Jakkula Mamatha |   ( Updated:2024-04-27 14:11:46.0  )
మద్యపాన నిషేధం..సీపీఎస్ రద్దు లేకుండా మేనిఫెస్టోనా?:జనసేన నేత
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: గత మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం తరువాతే 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పి మహిళలను నమ్మించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నయవంచన చేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. జగన్ శనివారం విడుదల చేసిన ఎన్నికల మెనిఫెస్టోలో మద్యపాన నిషేధం అంశం మాయమైందని, ఉద్యోగులకు వారం రోజుల్లో చేస్తానన్న సీపీఎస్ రద్దు అదృశ్యమైపోయింది అని ఎద్దేవా చేశారు. ఏడాదికో జాబ్ క్యాలెండర్, రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ అన్న జగన్ అవేమీ చేయకుండానే 99.5శాతం హామీలు నెరవేర్చానని దారుణంగా అబద్ధాలు చెబుతూ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని శనివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.

దశల వారీ మద్యపానం అమలు చేయకపోగా రాబోయే పాతికేళ్ల మద్యం అమ్మకం మీద అప్పు తెచ్చి భవిష్యత్‌లో వచ్చే ప్రభుత్వాలు కూడా మద్య నిషేధం అమలు చేసే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని 25 మద్యం కంపెనీలలొ 16 కంపెనీలు జగన్ అనుచరులవే అని అవే నకిలీ మద్యం ,నాణ్యత లేని మద్యం సరఫరా చేసి వేలాది మంది చావుకు కారణమయ్యాయని ఆరోపించారు. ఎస్సీలకు సబ్ ప్లాన్ లేదని, వారికి సంబంధించిన 27 పథకాలు తీసేశారని, ఒక దళితుడుకి బెయిల్ ఇవ్వడానికి కోర్ట్‌కి వచ్చే తీరిక లేదని విమర్శించారు. 99 శాతం హామీల అమలు చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా జగన్? అని ప్రశ్నించారు. ఫ్యాన్ ఎక్కువ తిరగదని, ఈ సారి బేరింగ్ కాలిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.

Read More..

చంద్రబాబు, పవన్‌కు మరో షాక్.. ఈసీకి కంప్లైంట్ చేసిన వైసీపీ

Advertisement

Next Story

Most Viewed