Visakha: ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై తీర్పు రిజర్వ్

by srinivas |
Visakha: ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. 2020లో విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువులు లీకై 15 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, మెరుగైన పరిహారం ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. కాగా విశాఖ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 12 మంది అప్పుడే మరణించగా.. మరో ముగ్గురు కొన్ని రోజులు చికిత్స తర్వాత కన్నుమూశారు. పాలిమర్స్ నుంచి ఒక్కసారిగా విషవాయువులు విడుదల అయి ఊపిరి అందక జనాలు పిట్టల్లా రోడ్డుపై కుప్పకూలిపోయారు. చూస్తుండగానే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రాణాలు పోయాయి. ఏపీలో జరిగిన పెను ప్రమాదాల్లో విశాఖ పాలిమర్స్ ఘటన అందరినీ కలిచి వేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటిచింది. అయితే ఘటనపై మెరుగైన విచారణ, పరిహారం ఇవ్వాలని బాధితుల తరపున కొందరు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed