విశాఖకు పదవుల పండుగ.. ఆయా శాఖల ఛైర్మన్లుగా ఐదుగురు

by Rani Yarlagadda |
విశాఖకు పదవుల పండుగ.. ఆయా శాఖల ఛైర్మన్లుగా ఐదుగురు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాకు ఐదు నామినేటెడ్ పదవులు వరించాయి. రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్‌గా అనకాపల్లికి చెందిన ఎం.సురేంద్ర నియమితులయ్యారు. కొప్పల వెలమ చైర్మన్‌గా మాడుగుల చిన్న పివిజి కుమార్‌ని ప్రభుత్వం నియమించింది. రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరావును నియమించింది.

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్‌గా..

ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్‌గా విశాఖ నగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జి.బాబ్జీని నియమించారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్‌గా విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ నియమితులయ్యారు. జీసీసీ చైర్మన్‌గా మాజీ మంత్రి కిలారు శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. వీ‌ఎం‌ఆర్‌డీ‌ఏ చైర్మన్‌గా బిఎస్ఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ నియమితులయ్యారు.

Advertisement

Next Story