ఎన్నిక‌ల విధుల నుంచి ఎవ‌రికీ మిన‌హాయింపు లేదనీ తేల్చిచెప్పిన జిల్లా క‌లెక్ట‌ర్

by Jakkula Mamatha |
ఎన్నిక‌ల విధుల నుంచి ఎవ‌రికీ మిన‌హాయింపు లేదనీ తేల్చిచెప్పిన జిల్లా క‌లెక్ట‌ర్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:ఎన్నిక‌ల విధుల నుంచి ఎవ‌రికీ మినిహాయింపు లేద‌ని అన్ని శాఖ‌ల ప‌రిధిలో ప‌ని చేసే ఉద్యోగులు, సిబ్బంది వివ‌రాల‌ను అత్యంత క‌చ్చితంగా జిల్లా యంత్రాంగానికి నివేదించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున ఆయా శాఖ‌ల అధిప‌తుల‌ను ఆదేశించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యే వారు త‌ప్ప మిగిలిన వారంద‌రూ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. పోల్ మేనేజ్మెంట్, సిబ్బంది కేటాయింపు ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించే నిమిత్తం గురువారం జిల్లాలోని అన్ని శాఖ‌ల అధిప‌తులతో క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.ప‌లు అంశాల‌పై మార్గ‌నిర్దేశ‌కాలు జారీ చేశారు.

శాఖ‌ల ప‌రిధిలో ప‌ని చేసే ఉద్యోగులు, సిబ్బంది వివ‌రాల‌ను నిర్ణీత కాలంలోగా అంద‌జేయాల‌ని, ఇదివ‌ర‌కు ఇచ్చిన డేటాలో మార్పులు చేర్పులు ఉంటే ముందుగా తెలియ‌జేయాల‌ని చెప్పారు. ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో విజ‌య‌వంతంగా సాగేందుకు అంద‌రూ స‌హ‌కారం అందించాల‌ని, స‌మ‌ష్టి కృషి చేయాల‌న్నారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో ఉండే సిబ్బందికి మాత్ర‌మే మినిహాయింపు ఉంటుంద‌ని, మిగిలిన వారంద‌రూ త‌ప్ప‌కుండా ఎన్నిక‌ల విధుల్లో భాగ‌స్వామ్యం కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నిక‌ల ప్ర‌క్రియ నిర్వ‌హ‌ణకు స‌రిప‌డా సిబ్బందిని కేటాయించాల‌ని ఆదేశించారు. తొలి విడ‌త ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ నాటికి వివరాల‌ను అత్యంత క‌చ్చితంగా స‌మ‌ర్పించాల‌ని సూచించారు.స‌మావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహ‌న్ కుమార్, వీఎంఆర్డీఏ జేసీ, మాన‌వ వ‌న‌రుల కేటాయింపు నోడ‌ల్ అధికారి ర‌వీంద్ర‌, వివిధ విభాగాల హెచ్.వో.డి.లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed