- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువత ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత.. సీఎం జగన్
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలోని కైలాసపురంలో అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడతూ.. ఈ మాల్ తో 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతోందన్నారు. రెండో దశలో 3వేల మంది పనిచేసేలా ఐటీ క్యాంపస్ ఏర్పాటు అవుతుందన్నారు. మూడో దశలో 200 గదులతో స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. సీఎం పర్యటనలో భాగంగా జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఏయూలో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌తో సహా పలు నూతన భవనాలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్ బాబు, గుడివాడ అమర్ నాథ్, టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ అధ్యక్షులు జె. సుభద్ర, ఎంపి ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, శాసన మండలి సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరదు కళ్యాణి, శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గణేష్ బాబు, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, ఉమా శంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, నెడ్ క్యాప్ ఛైర్మన్ కెకె రాజు, డిసిసిబి చైర్మన్ కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు.