Architecture Engineering: సూక్ష్మంలో సృజనాత్మకత..ఐదేళ్లలో అద్భుతాలు

by srinivas |   ( Updated:2023-02-18 15:51:59.0  )
Architecture Engineering: సూక్ష్మంలో సృజనాత్మకత..ఐదేళ్లలో అద్భుతాలు
X

దిశ, ఉత్తరాంధ్ర: సాధనమున పనులు సమకూర ధరలోన.. వేమన శతకంలోని ఈ పద్యాన్ని చిన్నారులు టక టక వల్లే వేస్తుంటారు. అయితే దీని అర్ధాన్ని సృజనతో కూడిన ఆవిష్కృతాల వైపు ఆలోచన అడుగులను వేసే వారు అరుదుగానే ఉంటారు. ఈ తరహా అద్భుతాలను సూక్ష్మ కళా రూపంలో 21 ఏళ్ల జి వెంకటేష్ ఆవిష్కృతం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి ఆసక్తి గల ఈ ప్రతిభ దాగి ఉన్న కృషి ఫలితం ఐదేళ్లలో అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఫలితంగా వెంకటేష్‌కు విశేషమైనటువంటి అవార్డులు లభించాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.


390 సూక్ష్మకళ ఆవిష్కరణలు

విశాఖ జిల్లాలో నక్కపల్లి మండలంలో సూరిబాబు సత్యవతి దంపతుల కుమారుడు వెంకటేష్ గట్టెం ఆర్కిటెక్చర్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నారు. భవిష్యత్తులో గొప్ప ఆర్కిటెక్ట్, ఆర్టిస్టు‌గా తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి లక్ష్యంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఆయన 390 సూక్ష్మకళ ఆవిష్కరణలకు ప్రాణం పోశారు. పెన్సిల్ ముళ్ళు డ్రాయింగ్ పేపర్లు శుద్ధ మొక్కలు వెదురు పుల్లలు వంటి చిన్నపాటి వాస్తు సామగ్రితో సూక్ష్మకలలో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. చిన్ననాటి నుంచి ఎన్నో అవార్డులు పురస్కారాలు, ప్రశంసలు ఆయన మెదడును మరింత పదును పెట్టాయి. పలు ప్రదర్శనలలో ఆయన సూక్ష్మ కళాఖండాలు విద్యార్థులను ఆలోచింపచేశాయి. పెన్సిళ్లపై భారత దేశ చిత్రపటం నమూనా, ఎలక్ట్రికల్ బల్బులో ఆలయ నమూనా, 5 వేల అగ్గిపుల్లలతో వెంకటేశ్వర స్వామి నమూనా, వెదురు పుల్లలతో ఈఫిల్ టవర్, శుద్ధ ముక్కలతో కౌలాలంపూర్ పెట్రోనాస్ టవర్స్ తయారీతో తన విశేష ప్రతిభ పాటలను చాటుకుంటున్నారు. పెన్సిల్ ముల్లుతో ఏనుగు నమూనా ఆవిష్కరణ అద్భుతం అనిపిస్తుంది. ఇందుకోసం వెంకటేష్ వర్టికల్ బ్లేడు గుండుసూది వినియోగించారు. చిన్నపాటి పెన్సిల్ అందుబాటులో ఉండే పరికరాలతో విశేష సూక్ష్మ కళలను అద్భుత ఆవిష్కరణలకు వేదికగా ఆయన మస్తిష్కం ప్రతిభ కుసుమాలను గుబాలిస్తుంది.

పెన్సిల్ ముల్లులో వినాయకుడు

ఇప్పటివరకు వెంకటేష్ రూపొందించిన కళాకృతులు ఒకసారి చూసుకున్నట్లయితే పెన్సిల్ ముల్లులో వినాయకుడు, తల్లి ఒడిలో బిడ్డ క్రీస్తు సిలువ, చైన్ అశోక చక్ర, రిపబ్లిక్ డే వంటి అనేక సూక్ష్మ కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి పగిలిన గాజు పెంకులతో నెమలి, రామచిలుక వంటి పక్షి బొమ్మలు రూపొందించారు. ఐస్ క్రీమ్ పుల్లలతో పెన్ స్టాండ్, ఉల్లిగడ్డపై పొరతో ఉప్పు సత్యాగ్రహం దృశ్యరూపం బిడ్డను ముద్దాడే తల్లి, అగ్గిపుల్లలతో అంకెలు, అక్షరాలు. కొబ్బరి చెక్కలతో వెంకటేశ్వరస్వామి సంకు చక్రాలు, తాటి ఆకులతో విఘ్నేశ్వరుడు, ఇరుకైన గాజు సీసాలో తల్లి బిడ్డ, శుద్ధ మొక్కతో వరల్డ్ కప్ చెస్ బోర్డు, పెన్నులు దారపు గొట్టాలతో ఈఫిల్ టవర్, ఇలా అనేక సూక్ష్మ అద్భుతాలను తయారు చేశారు. పదిమందిలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఆశయంతో ముందుకెళ్తున్నారు. యువత సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక అంశంపై ఆసక్తి పెంచుకొని ప్రత్యేకతను చాటుకుంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నది తన అభిప్రాయంగా గట్టెం వెంకటేశ్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed