- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో గంజాయి బ్యాచ్ వీరంగం.. పోలీస్ బైక్‌ను ఢీకొట్టి పరారీ
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా యధేచ్చగా గంజాయి తరలిస్తున్నారు. కార్లు, లారీల్లో లక్షల విలువైన సరుకును తరలించి సొమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడైనా తనిఖీలు తగిలితే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏదీ కురకపోతే అక్కడ నుంచి తప్పించుకుంటున్నారు. విశాఖలో ఇలాంటి ఘటన తాజాగా కలకలం రేపింది.
నగరంలో లిక్విడ్ గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అయితే పోలీసులను చూసిన దుండగులు కారుతో పరారయ్యేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బైక్‌తో వెంబడించారు. స్పీడుగా వెళ్లి కారుకు అడ్డం పెట్టారు. అయితే స్మగ్లర్లు మరింత రెచ్చిపోయారు. పోలీస్ బైక్‌ను ఢీకొట్టి గాజువాక వైపు వెళ్లారు. అటు పోలీసులు కూడా వెనక్కి తగ్గలేదు. వేగంగా వెంబడిచడంతో షీలా నగర్ వద్ద దుండగులు కారును వదిలేసి ఉడాయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కారులో ఉన్న లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.