Vijiyasai Reddy: అదనపు మెడికల్ సీట్లతో విస్తృత అవకాశాలు

by srinivas |   ( Updated:2023-02-06 12:59:24.0  )
Vijiyasai Reddy: అదనపు మెడికల్ సీట్లతో విస్తృత అవకాశాలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి మూడేళ్లలో అదనంగా 2,550 మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడంతో వైద్య, విద్యా రంగంలో విస్తృత అవకాశాలు కలగనున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ‌.8480 కోట్లు వ్యయం చేస్తుందని ఆయన చెప్పారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో అన్నిటికంటే విద్యపైనే ఎక్కువ నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని స్పష్టం చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం టాప్ 200 విదేశీ వర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నదని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story