వైసీపీ మేనిఫెస్టో ఆరోజే!.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

by Ramesh Goud |   ( Updated:2024-03-02 10:33:09.0  )
వైసీపీ మేనిఫెస్టో ఆరోజే!.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల వద్ద జరగబోయే నాలుగవ సిద్ధం సభా పోస్టర్ ని విడుదల చేసిన ఆయన, ఈ సభలోనే వైసీపీ మేనిఫెస్టోను కూడా సీఎం జగన్ విడుదల చేయనున్నారని తెలిపారు. సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను విజయసాయి రెడ్డి పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేదరమిట్లలో సిద్ధం సభను ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని, ఇంతకాలం చేసిన అభివృద్ది, సంక్షేమం తదితర విషయాలను సీఎం జగన్ వెల్లడిస్తారని, అలాగే రాబోయే ఎన్నికలకు సంబందించిన మేనిఫెస్టోను కూడా ఇదే సభలో విడుదల చేస్తామని తెలిపారు.

కాగా ఇటీవలే మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీనియర్ ఐఏస్ అధికారులు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో యువత, మహిళలు, రైతులకు ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ.. నవరత్నాలను కొనసాగిస్తూ వాటికి ధీటుగా ఉండేలా కొత్త పథకాలు చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే రైతు రుణమాఫీ, పించన్ పెంపుతోపాటు జీవన భృతిని కూడా మేనిఫెస్టోలో చేర్చాలి అనే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తొంది.

Read More..

పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ

Advertisement

Next Story