- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM జగన్‌పై దాడి.. ఈసీ ఎదుట విజయసాయిరెడ్డి కీలక డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయం అయ్యింది. తల నుంచి రక్తం కారిపోతుంటే వైద్యులు బస్సులో ప్రథమ చికిత్స చేశారు. చికిత్స అనంతరం మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. ఇప్పటికే జగన్‌పై జరిగిన దాడిపై పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక చంద్రబాబు ఉన్నాడని తమకు అనుమానం ఉందన్నారు. హింస ద్వారా చంద్రబాబు అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడని విమర్శించారు. గతంలోనూ విశాఖ జిల్లాలో జగన్‌పై దాడి జరిగిందని గుర్తుచేశారు. ఆ దాడి సమయంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిపారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించినా పాఠాలు నేర్చుకోకుండా హింసా ధోరణిలో ప్రవర్తిస్తున్నాడని సీరియస్ అయ్యారు.