- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు లిస్ట్లు విడుదల చేసాం.. త్వరలో మరో లిస్ట్.. విజయసాయిరెడ్డి
దిశ వెబ్ డెస్క్: వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో ఈరోజు మూడో జాబితా విడుదల అయింది. కాగా నాలుగో జాబితా కూడా త్వరలోనే విడుదల అవుతుంది వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి సమస్య లేదన్న ఆయన.. వైసీపీలోనే అత్యంత విలువైన నాయకుడు బాలినేని అని ఎప్పటికీ పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని తెలిపిన విజయసాయిరెడ్డి.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్థానం ఆయనకే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక రాజకీయ పార్టీలు అన్న తర్వాత పరస్పర ఆరోపణలు సహజమని.. వాటికి తిట్టడం అనే పదాన్ని టిడిపి వాడుతుంది అని అది సబబు కాదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ నేతలను టిడిపి నేతలు విమర్శించినప్పుడు ఆ విమర్శలను తిప్పి కొట్టడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఒక్క వైసీపీ నే కాదు ఏ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే ఒప్పుకోవకి.. ఆ విమర్శలను తిప్పికొడతాయని.. అలా కొట్టడం సహజమని ఆయన పేర్కొన్నారు. టిడిపి వాళ్ళు ఏ ఆరోపణలు చేయకపోతే తామెందుకు తిరిగి వారి మీద విమర్శలు కురిపిస్తామని తెలిపిన ఆయన.. టిడిపి నేతలు చెప్పినట్లు తాము తమని తిడుతున్నారు అని చెప్పమని విజయ్ సాయి రెడ్డి తెలిపారు.
ఇక తమ నేతల జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం పై గతంలోనే విచారణ జరగగా.. ఆ రిపోర్టును కేంద్రానికి సమర్పించామని ఆయన తెలియజేశారు. టిడిపి దొంగ ఓట్ల వ్యవహారంలో సీఈసీకి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశామని.. అలానే గతంలోనూ చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లతో గెలిచారని అందుకు గల రుజువులను కూడా సీఈసీ ముందు ఉంచామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.