గుర్తింపు లేని జనసేనను ఎలా అనుమతిస్తారు..? విజయసాయిరెడ్డి ఫైర్

by Indraja |
గుర్తింపు లేని జనసేనను ఎలా అనుమతిస్తారు..? విజయసాయిరెడ్డి ఫైర్
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం తోలి రోజు గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పార్టీ అధినేతలు సీఈసీ అధికారులను కలిశారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలానే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా సీఈసీని కలిశారు. కాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సీఈసీ బృందాన్ని కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఆయన మొత్తం ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఇక జనసేన పార్టీ గుర్తింపు లేని పార్టీ అని.. అలాంటి పార్టీని తెలుగుదేశం పార్టీతో పాటు ఎలా అనుమతిస్తారని..? ప్రశించారు. ఇక జనసేన పార్టీ గుర్తు గ్లాస్ సింబల్ అని అది జనరల్ సింబల్ అని తెలిపారు. అలానే టీడీపీ అధినేత వైసీపీకి బోగస్ ఓట్లు ఉన్నాయని పదేపదే ప్రస్తావిస్తున్నారని.. ఓ వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎలా తెలుస్తుందో చెప్పాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed