ఉజ్వల పథకం అమలుపై ప్రశ్నించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

by Seetharam |
ఉజ్వల పథకం అమలుపై ప్రశ్నించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఉజ్వల పథకం కింద ఇచ్చిన ఎల్‌పీజీ కనెక్షన్‌ల వివరాలపై వైసీపీ రాజ్య సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఆరా తీశారు. ఢిల్లీలోని పార్లమెంటులో ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏపీలో ఉజ్వల పథకం కింద ఇచ్చిన ఎల్‌పీజీ కనెక్షన్‌ల వివరాలపై ఆయన ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ప్రభుత్వం రూ.200 సబ్సిడీని ఇస్తోంది వాస్తవం కాదా? సబ్సిడీ కారణంగా తలసరి వినియోగం 2019-20లో 3 సిలిండర్ల నుంచి ప్రస్తుతం 4 సిలిండర్లకు పెరిగింది నిజమేనా? వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం సబ్సిడీని రూ.400కి పెంచడాన్ని కూడా పరిశీలిస్తుందా? వంటి అంశాలపై సమాచారం రాబట్టారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన పథకం కింద 5.57 లక్షల క్రియాశీల ఎల్‌పీజీల కనెక్షన్‌లు ఉన్నాయని తెలిపారు. పీఎంయూవై వినియోగదారులకు ఎల్‌పీజీని మరింత సరసమైనదిగా చేయడానికి మరియు స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం 12 సిలిండర్ల వరకు 14.2 కిలోల సిలిండర్‌కు 200/- సబ్సిడీ ఇచ్చిందన్నారు. అనంతరం అక్టోబర్ 2023 నుంచి సబ్సిడీని 14.2 కిలోల సిలిండర్‌కు 300కు పెంచిందని వివరించారు. తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.01 రీఫిల్స్ నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి 3.71 రీఫిల్స్‌ కు చేరుకుందని వివరించారు. 2023-24కి (అక్టోబర్‌ 2023నాటికి) వినియోగం 3.8కి చేరిందని పేర్కొన్నారు. ఇక ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో కింద పేర్కొన్న విధంగా కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed