- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల ఫలితాలు వెలువడకముందే చేతులెత్తేసిన వంగా గీత..కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ ప్రధాన పార్టీ నేతలందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ సారి పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని లక్ష్యంతో ఉన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత పోటీ చేశారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో అనే విషయం ఆసక్తిగా మారింది.
వంగా గీత గెలుపు కోసం వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. పిఠాపురంలో దాదాపు ఆమెనే గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు కూడా తేల్చేశాయ్. అయితే అటు లక్ష మెజారిటీతో జనసేనాని గెలుస్తారని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వంగా గీత జనసేన గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినీ నటులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు అని చెప్పారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబం గురించి తనకు తెలుసని చెప్పింది. చిరంజీవి, నాగబాబు అంటే తనకు గౌరవమని తెలిపింది. మెగా ఫ్యామిలీకి కూడా తన గురించి తెలుసన్నారు.
ఎన్నికల సమయంలో ఎవరిపైన తను వ్యక్తిగత విమర్శలు చేయలేదన్న విషయాన్ని పదే పదే గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో గీత కామెంట్స్‌తో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ప్రత్యర్థిని పొగడ్తలతో ముంచెత్తడమేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఎన్నికల తర్వాత ఇలా మాట్లాడుతున్నారంటే ఫలితాలకు ముందే ఓడిపోతానని తెలిసి చేతులెత్తేశారా? అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఫలితాల్లో ఓడిపోతే కూటమిలోకి లేదా జనసేన లోకి జంప్ అవ్వడానికి ఫ్రీ ప్లాన్‌గా ఉన్నారా? అని నెట్టింట గట్టిగానే చర్చించుకుంటున్నారు. కాగా పిఠాపురం లో ఎవరు గెలుస్తారో అనే విషయం జూన్ 4వ తేదీన తేలిపోనుంది.