Rammohan Naidu : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

by M.Rajitha |
Rammohan Naidu : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌(Bhogapuram Airport) పై కేంద్ర పౌర విమానాయశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కీలక ప్రకటన జారీ చేశారు. ఆదివారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అతి త్వరలోనే ఎయిర్‌పోర్ట్‌ పనులు పూర్తి చేసి, విమానాశ్రయ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌ వలన స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్థికస్థితి, టూరిజం పెరిగిందని ఎంపీ అన్నారు. విజయనగరంతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు కూడా వృద్ధిలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story