- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి ఆ పరిశ్రమలన్నీ వస్తున్నాయి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి చాలా పరిశ్రమలు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ పరిశ్రమలన్నీ మళ్లీ వెనక్కి వస్తున్నాయమని తాజాగా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఏపీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలతో పాటు కొత్త కంపెనీలను ఆహ్వానిస్తున్నామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీ దృష్టిలో ఉందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి రూ. 15 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. భవిష్యత్తులో ఏపీ కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లి పోయిందని, జగన్ అనే గ్రహణం కారణంగా ఆలయాలను సైతం ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇన్ని రోజులకు ఆంధ్రప్రదేశ్ జనాలకు మంచి రోజులు వచ్చాయని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు.