రామోజీరావును చాలాసార్లు కలవాలని ప్రయత్నించా.. కానీ కలవలేకపోయా: ఉండవల్లి ఎమోషనల్

by Satheesh |   ( Updated:2024-06-08 13:52:44.0  )
రామోజీరావును చాలాసార్లు కలవాలని ప్రయత్నించా.. కానీ కలవలేకపోయా: ఉండవల్లి ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల ఇప్పటికే పలువురు సంతాపం వ్యక్తం చేయగా.. తాజాగా రామోజీరావు మరణం పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామోజీరావును తలుచుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు. వివిధ రంగాల్లో రాణించి రామోజీ రావు దేశవ్యాప్తంగా పేరు గాంచారని కొనియాడారు. ఆయన ఏ రంగంలో ప్రవేశించినా సెలబ్రెటీ స్థాయికి ఎదిగారని కీర్తించారు. రామోజీ రావును కలవాలని చాలాసార్లు ప్రయత్నించానని.. కానీ ఎప్పుడు కలవలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఈ కష్ట సమయంలో ఆయనకు కుటుంబ సభ్యులకు దేవుడు మనో ధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed