Breaking: యువకులకు తృటిలో తప్పిన ప్రమాదం

by srinivas |
Breaking: యువకులకు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రమాదమని తెలిసినా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వెనక్కి తగ్గేది లేదంటూ తప్పులు చేస్తున్నారు. సురక్షితంగా ఇంటికి వెళ్లాల్సింది పోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. కొన్ని సమయాల్లో గాయలతో బయటపడుతున్నారు. మరికొన్ని సమయాల్లో ప్రమాదం అంచుల దాక వెళ్లి తృటిలో తప్పించుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా పశ్చిమగోదావరం జిల్లాలో జరిగింది.

ఇటీవల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో ఉన్న వాగు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. కంసాలిపాలెంకు చెందిన ఇద్దరు యువకులు మాధవరం వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరారు. మాధవరం వద్ద వాగు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వెనక్కి వెళ్లకుండా వాగు దాటేందుకు ప్రయత్నం చేశారు. అయితే వాగు ఉధృతికి బైక్ కిందపడింది. వాగు నీటిలో కొట్టుకోపోయేంత పని జరిగింది. కానీ స్థానికులు గమనించి వెంటనే బైక్‌తో పాటు యువకులను బయటకు తీసుకువచ్చారు. దీంతో యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది.

Advertisement

Next Story

Most Viewed