Kodali Nani : గుడివాడలో కొడాలి నానికి ట్విస్ట్.. వైసీపీ అభ్యర్ధి ఆయనే

by Ramesh Goud |   ( Updated:2024-02-19 06:33:26.0  )
Kodali Nani : గుడివాడలో కొడాలి నానికి ట్విస్ట్.. వైసీపీ అభ్యర్ధి ఆయనే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి అసమ్మతి సెగలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కొడాలి నాని అడ్డా అయిన గుడివాడలో ఆయనకు వ్యతిరేఖంగా వెలిసిన పోస్టర్లు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అభ్యర్ధిగా హనుమంతరావు ఎంపిక అయ్యారని జగన్, వైఎస్ఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్షీలు ప్రధాన కూడళ్ళలో పెట్టడం వైసీపీ కార్యకర్తలని, నాని అభిమానులని ఒకింత కలవరానికి గురి చేస్తున్నాయి.

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని, గుడివాడ వైసీపీ అభ్యర్ధిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టారు. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు పేరు ఉండటంతో ఈ అవకాశం దక్కిందని, హనుమంతరావుకు శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరుగుతోండటం గమనార్హం.

ఇటీవలే కొడాలి నాని పలు మార్లు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కానీ ఇవన్నీ నిజాలు కావని, కొడాలి నాని వ్యతిరేఖవర్గం కావాలనే ఈ చర్యలకు పాల్పడుతొందని వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే హనుమంతరావు గెలుపుకు కొడాలి నాని సపోర్టు చేస్తారా.. లేదా అనే ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story