Ap News : అమరావతి మున్సిపాలిటీగా ఆ రెండు మండలాలు

by Seetharam |   ( Updated:2022-09-09 09:32:34.0  )
Ap News : అమరావతి మున్సిపాలిటీగా ఆ రెండు మండలాలు
X

దిశ, ఏపీ బ్యూరో : అమరావతి ప్రాంతం పరిధిలోని గ్రామాలపై వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ‌రావ‌తి ప‌రిధిలోని 22 గ్రామాల‌తో అమ‌రావ‌తి మునిసిపాలిటీని ఏర్పాటు చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తుళ్లూరు, మంగ‌ళ‌గిరి మండ‌లాల ప‌రిధిలోని 22 గ్రామాల్లో గ్రామ స‌భ‌లు నిర్వహించి ఆయా గ్రామాల ప్రజ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించాల‌ని గుంటూరు జిల్లా క‌లెక్టర్‌కు ఆంధ్రప్రదేశ్ పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టర్ 22 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేందుకు నోటీసులు జారీ చేశారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన 22 గ్రామాల‌తోనే అమ‌రావ‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాలని గ‌తంలో ప్రభుత్వం ప్రతిపాద‌న‌లు సిద్ధం చేసింది.

ఈమేర‌కు ఆ గ్రామాల్లో గ్రామ స‌భ‌లు నిర్వహించగా ఆయా గ్రామ సభలలో ప్రజలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 22 గ్రామాల‌తో కాకుండా రాజ‌ధాని గ్రామాలుగా ప‌రిగ‌ణిస్తున్న మొత్తం 29 గ్రామాల‌తో మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాలంటూ కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చారు. గ్రామ సభలలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. దీంతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాజాగా ప్రభుత్వం గ్రామస్థుల ప్రతిపాదనలను పక్కనపెట్టి అవే 22 గ్రామాల‌తో ఇప్పుడు మునిసిపాలిటీని ఏర్పాటు చేయాలని కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం గమనార్హం.

Also Read : అమరావతి రైతుల మహా పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్


Advertisement

Next Story

Most Viewed