Tirumala: అధికారంలో టీడీపీ.. తిరుమలలో సౌకర్యాలను పునరుద్ధరించిన టీటీడీ

by Indraja |
Tirumala: అధికారంలో టీడీపీ.. తిరుమలలో సౌకర్యాలను పునరుద్ధరించిన టీటీడీ
X

దిశ వెబ్ డెస్క్: కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశం నలుమూల నుండి భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు 2019కి మందు క్యూలైన్లలో ఉన్న భక్తులకు పాలు, అల్పాహారం, సాంబార్ అన్నం పంపిణీ చేసేవారు. అలానే నడిచి వచ్చే భక్తులకు కిందే టోకెన్లు అందించి ప్రత్యేక దర్శనం కల్పించేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రావడంతోనే క్యూలైన్లలో ఉన్న భక్తులకు అందించే పాలు, అల్పాహారం, సాంబార్ అన్నం పంపిణీని టీటీడీ నిలిపిదవేసింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభత్వం అధికారంలోకి రావడంతోనే తిరుమలపై దృష్టిసారించిది. దీనితో తిరుమలలో గత ఐదేళ్లుగా దూరమైన సౌకర్యాలను మళ్లీ టీటీడీ పునరుద్ధరించింది. అలానే నడిచి వచ్చే భక్తులకు కిందే టోకెన్లు అందజేస్తున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగింది. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు మాట్లాడుతూ.. ఐదేళ్ల తరువాత వెంకన్న దర్శనం ప్రశాంతంగా చేసుకున్నాం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed