- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గరుడసేవకు అంతా సిద్ధం.. భక్తులకు ఈఓ కీలక విజ్ఞప్తి
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజున మలయప్పస్వామి వారు మోహినీ అవతారంలో గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈఓ శ్యామలారావు తెలిపారు. సుమారు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. భక్తులకోసం ప్రధాన, ముఖ్యమైన కూడళ్లలోనూ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గరుడవాహన సేవకు భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో కొండపైకి అధికవాహనాలను అనుమతించడం లేదని, భక్తులు సహకరించాలని శ్యామలరావు విజ్ఞప్తి చేశారు. రేపు ఒక్కరోజే కొండమీది నుంచి కిందికి, కింది నుంచి కొండమీదికి ఏపీఎస్ ఆర్టీసీ 400కు పైగా బస్సులతో 3 వేల ట్రిప్పులను నడిపేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించారు. కాగా.. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.