పిల్లలతో తిరుపతి వెళ్తున్నారా? అయితే ఈ ఆంక్షలు తెలుసుకోవాల్సిందే

by Seetharam |   ( Updated:2023-08-13 14:14:19.0  )
పిల్లలతో తిరుపతి వెళ్తున్నారా? అయితే ఈ ఆంక్షలు తెలుసుకోవాల్సిందే
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పిల్లలతో వెళ్తున్నారా? పిల్లలతో కలిసి మెట్లు, నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్తున్నారా? ద్విచక్రవాహనాలపైనా స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే మీరు టీటీడీ తీసుకువచ్చిన ఆంక్షలు గురించి తెలుసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బంది పడతారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న మార్గంలో చిరుత దాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవలే ఒక చిన్నారిని చిరుత చంపేసింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమకు ముఖ్యం అని ప్రకటించింది. ఈ మేరకు శ్రీవారి దర్శనార్థం నడక దారిలో వెళ్తున్న భక్తుల భద్రత విషయంలో పలు ఆంక్షలు విధించింది. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అంతేకాదు భక్తుల రక్షణ కోసం వారికి రక్షణగా ముందు వెనుక రోప్‌ను, సెక్యూరిటీ గార్డులను సైతం ఏర్పాటు చేసింది.

కాలిబాట మార్గంలో ఆంక్షలు

చిరుత దాడిలో బాలిక మృతి చెందిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో అటవీ సంరక్షణ చట్టాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య పెరిగిందని తెలిపారు. అయితే వన్యప్రాణుల భారిన భక్తులు పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే టీటీడీకి ముఖ్యమని చెప్పుకొచ్చారు. చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని భూమన కరుణాకర్ రెడ్డి సూయించారు. ఇదే సందర్భంలో టీటీడీ తీసుకొచ్చిన కొత్త ఆంక్షలను సైతం ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిలిపివేస్తున్నట్లు టీటీటీ తెలిపింది.

పిల్లలకు ట్యాగ్‌లు

ఇదిలా ఉంటే ఆదివారం పిల్లలతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల విషయంలో టీటీడీ చాలా జాగ్రత్తలు పాటించింది. పిల్లలు తప్పిపోతే వారిని కనిపెట్టేందుకు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్‌లు వేశారు.ఈ ట్యాగ్‌‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, పోలీసు టోల్‌ ఫ్రీ నంబర్‌ పొందుపరుస్తున్నారు. ఇకపోతే కాలినడకన వచ్చే భక్తులు వందమందిని గుంపులు గుంపులుగా గాలిగోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు అనుమతిస్తున్నారు.ముందు వెనుక రోప్ ఏర్పాటు చేసి భద్రతా సిబ్బంది సాయంతో అనుమతిస్తున్నారు. కాలిబాట మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Advertisement

Next Story