విజయవాడలో విషాదం.. దంపతుల ఆత్మహత్య

by srinivas |
విజయవాడలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. రామలింగేశ్వర నగర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉంటున్న దంపతులు కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులేకాకుండా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed