GPS రద్దు చేసి OPS అమలు చేయాలి..ఉద్యోగ సంఘాల డిమాండ్

by Jakkula Mamatha |   ( Updated:2024-07-15 08:54:13.0  )
GPS రద్దు చేసి OPS అమలు చేయాలి..ఉద్యోగ సంఘాల డిమాండ్
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన వైసీపీ గతంలో చేసిన పలు కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలు ఫైరతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఉద్యోగ సంఘాల డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్(OPS)ను తీసుకురావాలని SGTF, PRTU, UTF, CPS సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు గెజిట్ పత్రాలను దహనం చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఏపీటీఎఫ్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed