- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో టమాటా @ రూ.100
X
దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో విజయవాడ మార్కెట్‌లో కిలో రూ. 64 ఉంటేనే టమాటా కొనేందుకు వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. ఇప్పుడు ఏకంగా టమాటా సెంచరీ కొట్టింది. విశాఖ మార్కెట్‌లో వ్యాపారులు కిలో టమాటా రూ. 100కు విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా భగ్గుమన్న టమాటా ధరతో విశాఖ ప్రజలు లబో దిబో మంటున్నారు. కూరగాయలు కొనకుండానే కళ్ల వెంట నీళ్లు తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఇదే విధంగా ధరలు పెరుగుతూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలోనూ కూరగాయలు ధరలు చుక్కలనంటాయని, ప్రస్తుత ప్రభుత్వమైనా రేట్ల నియంత్రణపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.
Advertisement
Next Story