Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Shiva |
Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం శ్రీవారి దర్శనానికి ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఖచ్చితంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా మరో నాలుగు రోజులు గడిస్తే.. విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరిత తగ్గే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు ఏటీసీ వరకు వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 62,366 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 29,633 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed