- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో తిక్కారెడ్డి.. రామారావు పై ప్రశంసల జల్లు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రుల అభిమాన నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు 28 వర్ధంతి సందర్భంగా సంతాప సభను కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.కాగా ఈ సంతాప సభకు మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి నేతృత్వం వహించారు. కాగా ఈ వేడుకల్లో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల బడుగు బలహీన వర్గాలనే వర్గవిబేధాలు లేకుండా అందరికి రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చాటుతూ ప్రజా క్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయ వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసల జల్లు కురిపించారు. నేడు అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి.. కిలో బియ్యం రూ/ 2 కే అందించి ప్రజల ఆకలి తీర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని నొక్కి చెప్పారు. వృద్ధాప్య పింఛన్లు తెచ్చి వృద్దలకు అండగా నిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు.