- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలనాగిరెడ్డి పై తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల జోరు హోరందుకుంది. రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు నేతలు సాయిశక్తుల ప్రయత్నిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కాలాన్ని ప్రచారంలోనే గడుపుతున్నారు. తాజాగా గవిగట్టు గ్రామంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కార్యక్రమం నిర్వహించింది టీడీపీ. ఈ క్రయక్రమంలో తిక్కారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పైన విమర్శల జల్లు కురిపించారు. మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
క్రమంగా ఆస్తులు కూడా బెట్టుకునేందుకు పదవిని దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. ఇసుక వ్యాపారం, పంచాయితీలు, భూ దందా, అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ సంపదలను పెంచుకుంటున్నారే కానీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదని.. ఇన్నేళ్ళలో మీరు మంత్రలయానికి చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేస్తున్న అక్రమ ఇసుక దందా కారణంగా రోడ్లన్నీ సర్వనాశనమైయ్యాయని ధ్వజమెత్తారు.
ప్రజలు ఇప్పటికైనా మేలుకొని రానున్న ఎన్నికల్లో బాలనాగిరెడ్డికి సరైన గుణపాఠం నేర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షానికి అధికారపక్షం ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇరు పక్షాలు పోటా పోటీగా ప్రచారాల్లో బిజీ గా ఉన్నాయి. వైసీపీ ఈ సారి 175 స్థానాల్లో తమ పార్టీ జెండా ఎగరవేయడమే టార్గెట్ అంటోంది. మరో వైపు ఈ సారి జగన్ సీఎం అయితే ఆంధ్రని ఏ దేవుడు కాపాడలేడని.. జనసేనతో కలిసి పనిచేస్తోంది టీడీపీ.