Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు మరో ఉపద్రవం.. నిపుణుల కమిటీ కీలక హెచ్చరిక

by Shiva |   ( Updated:2024-09-11 14:53:36.0  )
Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు మరో ఉపద్రవం.. నిపుణుల కమిటీ కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలతో హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలోనే వదర ధాటికి డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ గేట్ వద్ద స్టాప్‌లాక్ గేట్లు సక్సెస్‌ఫుల్‌గా అమర్చారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు మాత్రమేని డ్యామ్ నిపుణుల కమిటి వెల్లడించింది. ఇప్పటికే ఆ గేట్లను 25 ఏళ్లు వినియోగించారని తెలిపారు. గేట్లు మార్చకపోతే ప్రమాదం కొని తెచ్చుకున్నేట్లేనని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా తుంగభద్ర డ్యామ్ నిపుణుల బృందం మరో కీలక హెచ్చరిక చేశారు. డ్యామ్ 22వ గేటు దిగువ భాగానా భారీ గొయ్యి ఏర్పడిందని అన్నారు. ఆ గోయ్యితో డ్యామ్ పునాదులను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు పార్కులో బోటింట్ కోసం ఏర్పాటు చేసిన సరస్సు తూముల నుంచి లీకేజీ ఉందని తేల్చారు. అది కూడా డ్యామ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణుల కమిటీ సూచించింది.

Advertisement

Next Story

Most Viewed

    null