- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత ఉన్మాదానికి మద్దతిస్తున్న పార్టీలను దేశం నుంచి తరిమేయండి:వైఎస్ షర్మిల
దిశ,ఎర్రగొండపాలెం: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూదాల అజితారావుతో ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. పట్టణంలోని కొలుకుల సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. షర్మిల మాట్లాడుతూ జగనన్న హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. ఇసుక దోపిడీ మద్యం భూకబ్జాలు రౌడియిజం దౌర్జన్యం వైసీపీ పాలనలో పెట్రైరేగిపోతుందన్నారు. మా బాబాయి వివేకానంద రెడ్డిని అతి దారుణంగా చంపి హంతకుడికి ఎంపీ టికెట్ ఇచ్చాడు అన్నారు. దేశంలో మతకల్లోలాలు కులాల మధ్య కుట్రలు కుంభకోణాలు. కుతంత్రాలు హత్యలు మానభంగాలు. ఆర్థిక దోపిడీలు తప్పుడు రాజకీయ నాయకులతో నిండి ఉన్న బీజేపీకి వైసీపీ టీడీపీ కొమ్ముకాస్తున్నాయన్నారు. పేదల జీవితాలు మరింత పేదలుగా దుర్భరంగా ఉన్నాయన్నారు. మీరంతా ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థి అజితమ్మ గారికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే. దేశవ్యాప్తంగా ఉచిత విద్య. ప్రతి మహిళా కుటుంబానికి. సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు. ఇల్లు లేని నిరుపేదలకు. ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు. రెండు లక్షలు రైతు రుణమాఫీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తుందని తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అనంతరం అజితారావు మాట్లాడుతూ తాను రెండు సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాను. నేను ఎల్లప్పుడూ మీ మధ్యనే మీతోనే ఉంటాను అందరూ నాకు సహకరించి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి. తాగు సాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. యువతీ యువకులకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో ఇతర ప్రాంతాలకు బతుకుతెరువు కోసం వలసలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వలసలను పూర్తిగా నియంత్రిస్తాను. అందరూ నాకు సహకరించి గెలిపించాలని ప్రాధేయపడ్డారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు.ఈద సుధాకర్ రెడ్డి. డాక్టర్ అనిల్ కుమార్. జిల్లా యువజన కాంగ్రెస్ అన్నల దాసు ప్రవీణ్ కుమార్. దుగ్గెం పూడి బాలకృష్ణ రెడ్డి. శ్రీను 5 మండలాల కాంగ్రెస్ నాయకులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Read More...