Vallabhaneni Vamsi: వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లు పనికిమాలిన సన్నాసులు

by Prasanna |   ( Updated:2023-06-11 08:36:13.0  )
Vallabhaneni Vamsi: వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లు పనికిమాలిన సన్నాసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాటికి కాలు చాపాడు కాబట్టి పేదలకు ఇస్తున్న సెంటు స్థలంను సమాధులతో పోల్చాడు అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అన్నారు. ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడు అని మండిపడ్డారు. గన్నవరంలోని పానకాల చెరువును రిజర్వాయర్‌గా చేసేందుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ శంకుస్థాపన చేశారు. పానకాల చెరువు రిజర్వాయర్ ద్వారా గన్నవరం ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుంది అని అభిప్రాయపడ్డారు. చెరువు పూడిక తీసిన మట్టిని గన్నవరం నియోజకవర్గంలోని జగనన్న లేఔట్ లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువ శాతం ఇళ్ళు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు అని గుర్తు చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు అని కొనియాడారు. పేద ప్రజలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు పనికిమాలిన సన్నాసులు అంటూ తిట్టిపోశారు. అమ్మ పెట్టదు అడక్కు తిన్నవ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి అని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చే వాళ్ళను విమర్శించడానికి సిగ్గుసెరం ఉండాలి అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ హెచ్చరించారు.

Read more: మే నెలలో కరెంటు బిల్లుల షాక్! విపక్షాల ఫైర్

Advertisement

Next Story

Most Viewed