- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics:నారా లోకేష్‌ను కలిసిన కేంద్రమంత్రి..కారణం ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో రెండో రోజు శాసనసభలో మంత్రులు సమావేశమయ్యారు. దీంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. కాగా, ముగింపు రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏపీ అసెంబ్లీకి విచ్చేశారు.
అసెంబ్లీ లాబీలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. టీడీపీ యువనేతలు ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ విమానాశ్రయాల పై నారా లోకేష్ ఆరా తీశారు. ఈ క్రమంలో పెండింగ్ విమానాశ్రయాలను రెండేళ్లలోపు పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు.