దుర్యోధనుడి పాత్రలో RRR.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2025-03-20 14:56:57.0  )
దుర్యోధనుడి పాత్రలో RRR.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీల(MLCs) సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ(గురువారం) సాయంత్రం విజయవాడ(Vijayawada) ఎ కన్వెన్షన్‌లో జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan), మంత్రి నారా లోకేష్(Minister Lokesh), స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatrudu) హాజరయ్యారు. కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్(Deputy Speaker) రఘురామకృష్ణంరాజు(RRR) దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ‘‘ఏమంటివి.. ఏమంటివి’’ అంటూ ఎన్టీఆర్(SrNTR) డైలాగ్ తో రఘురామ ఏకపాత్రభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు చప్పట్లు కొట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. RRR డైలాగ్స్‌తో ఒక్కసారిగా వేదిక ప్రాంగణమంతా కేరింతలతో మార్మోగింది. తమ తమ స్థానాల్లో నిల్చొని రఘురామకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed