Nara Bhuvaneswari:ప్రేమగా చీరలు కొనుక్కొచ్చిన చంద్రబాబు ..నారా భువనేశ్వరి రియాక్షన్ ఇదే!

by Jakkula Mamatha |
Nara Bhuvaneswari:ప్రేమగా చీరలు కొనుక్కొచ్చిన చంద్రబాబు ..నారా భువనేశ్వరి రియాక్షన్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్:విజయవాడలో నిన్న(బుధవారం) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేశారు. దీనిపై నేడు (గురువారం) నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన కోసం చేనేత చీరలు కొని తెచ్చినందుకు చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ‘చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం అద్భుతమై నిర్ణయం. చేనేత అనేది గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మాత్రమే కాదు, స్థిరమైన, నైతిక వారసత్వ కళా సంపద అన్నారు. మీ నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం చేనేతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అంకితభావంతో చేస్తున్న కృషి ఎంతో సంతృప్తికరంగా ఉంది’ అని నారా భువనేశ్వరి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed