Thirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

by Ramesh Goud |
Thirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో(Thirumala) కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. భక్తులు క్యూ కాంప్లెక్స్‌(Que Compex)లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం అభిస్తుంది. భక్తుల రద్దీ లేకపోవడంతో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య కూడా పడిపోయింది. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేవలం 65,299 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 20,297 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం(Income) రూ.3.75 కోట్లు వచ్చింది.

కాగా వైకుంఠ ఏకాదశి టికెట్లు మరో రెండు రోజుల్లో టీటీడీ(TTD) విడుదల చెయనుంది. డిసెంబర్ 23 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు(Srivani Trust) టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల కానుండగా.. డిసెంబర్ 24 తేదీన ఉదయం 11 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల అవుతాయి. అలాగే మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటలో మార్పు చేశారు. డిసెంబర్ 25 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లను టీటీడీ విడుదల చేయనుండగా.. డిసెంబర్ 26 తేదీన ఉదయం 11 గంటలకు రూ.300/- టికెట్లు.. అదే రోజు సాయంత్రం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed