- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > Chittoor: రెచ్చిపోయిన మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు.. బీసీవై పార్టీ అధినేతపై దాడి
Chittoor: రెచ్చిపోయిన మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు.. బీసీవై పార్టీ అధినేతపై దాడి
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రతివారిపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఎర్రతివారిపల్లి మంత్రి పెద్ది రెడ్డి సొంత గ్రామం కావడంతో బీసీవై పార్టీ నేత ప్రచారాన్ని అడ్డుకున్నారు. ప్రచార రథంపై దాడి చేశారు. బీసీవై పార్టీ నేతలకు సంబంధించిన 10 వాహనాలపైనా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వాహనాలన్నీ ధ్వంసం మయ్యాయి. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో బీసీవై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రచార రథాలపై దాడి చేయడంపై మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మంత్రి పెద్ది రెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Advertisement
Next Story