Breaking: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by srinivas |   ( Updated:2024-07-28 04:14:05.0  )
Breaking: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మురారి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. గుర్తు తెలియని వాహనం అతివేగంగా యువకుల బైక్‌ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆస్పత్రికి చేరుకున్న బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామాలతో పాటు ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed