Janasena: పవన్ కల్యాణ్ కటౌట్ కట్... తిరగబడ్డ ఫ్యాన్స్

by srinivas |   ( Updated:2024-10-06 14:19:56.0  )
Janasena: పవన్ కల్యాణ్ కటౌట్ కట్... తిరగబడ్డ ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు చింతారెడ్డిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, జనసేన(YCP, Janasena) మధ్య ఫ్లెక్సీల రగడ రాజుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఫ్లెక్సీలు, కటౌట్‌ను చింతారెడ్డిపాలెం కూడలిలో జనసేన కార్యకర్తలు(Janasena Activists) ఏర్పాటు చేశారు. అయితే పవన్ కటౌట్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో రచ్చ కొనసాగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సభ పేరుతో నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ(Nellore ZP chairperson Anam Arunamma), విజయ్ కుమార్ రెడ్డి(Vijay Kumar Reddy) ఫెక్సీలను చింతారెడ్డిపాలెం కూడలిలో ఏర్పాటు చేసేందుకు వైసీపీ(YCP) కార్యకర్తలు ప్రయత్నించడంతో జనసేన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుణమ్మ, విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకే పవన్ కల్యాణ్ కటౌట్‌ను తొలగించారని మండిపడ్డారు. ఆనం ఫ్లెక్సీలను తొలగించారు. ఈ క్రమంలో అధికారులు జోక్యం చేసుకున్నారు. ఇరువురి కటౌట్‌లు, ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదానికి తెరపడింది.

Advertisement

Next Story