Breaking: ఆళ్లగడ్డలో హైటెన్షన్

by srinivas |   ( Updated:2024-10-17 16:35:58.0  )
Breaking: ఆళ్లగడ్డలో హైటెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి(AV Subbareddy) వర్సెస్ భూమా అఖిల ప్రియ(Bhuma Akhila Priya)గా రాజకీయం మారింది. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. తాజాగా మళ్లీ రాజుకుంది. ఆళ్లగడ్డలో ఉండొద్దని ఏవీ సుబ్బారెడ్డికి భూమా అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చారు. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు.

కాగా విజయ డెయిరీ(Vijaya Dairy)లో ఫొటోల విషయంలో చైర్మన్ ఎస్వీ మోహన్ రెడ్డి(SV Mohan Reddy)తో ఇప్పటికే భూమా అఖిల ప్రియ వివాదం సంచనలంగా మారింది. విజయ డెయిరీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఫొటో లేకపోవడం, వైఎస్ జగన్(YS Jagan) ఫొటో ఉండటంతో భూమా అఖిల ప్రియ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ చైర్మన్ సీటులో కూర్చుని ఎస్వీమోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇంకా చల్లారకముందే వైవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య గొడవ ఆళ్లగడ్డలో ఉద్రిక్తతగా మారింది.

Advertisement

Next Story