- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగో జాబితాపై వైసీపీ కసరత్తు..సిట్టింగ్‌లలో హై టెన్షన్
దిశ వెబ్ డెస్క్: అధికార పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కూడా అధికార పగ్గాలు చేజారకుండా జాగ్రత్తగా వ్యూహ రచన చేస్తున్నారు. ఐప్యాక్ సర్వే ఆధారంగా సిట్టింగ్ లను మారుస్తూ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసింది వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీ లో సీటు దక్కని నేతలు అసహనానికి గురైన పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ రాదని తెలిసిన అభ్యర్థులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం నాలుగో జాబితాను విడుదల చేసేందుకు సంసిద్ధం అవుతోంది. దీనితో సిట్టింగ్ లలో హై టెన్షన్ నెలకొంది. అధిష్టానం ఎవరికీ అవకాశం ఇస్తుంది అనే ఉత్కంఠత నేతల్లో నెలకొంది. అయితే టికెట్ రాకపోతే వేరే గూటికి చేరేందుకు నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా పార్టీ టికెట్ ఎవరిని వరించనుందో తెలియాలంటే నాలుగో జాబితా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.