- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అజ్ఞాతంలో సోము వీర్రాజు.. కారణం అదేనా..?
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎవరకీ అందుబాటులో లేరని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ లేదా సిటీ నుంచి పోటీ చేయాలని సోము వీర్రాజు భావించారు. కానీ అధిష్టానం ఆయనకు సీటు ఇవ్వలేదు. పొత్తులో భాగంగా ఆరుగురు పార్లమెంట్, 10 మంది అసెంబ్లీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.
అయితే ఈ లిస్టులో సోము వీర్రాజు పేరు లేదు. దీంతో ఆయన మనస్థాపం చెందారనే ప్రచారం జరుగుతోంది. అందుకే రాజమండ్రిలో జరిగిన బీజేపీ నేతల సమావేశానికి కూడా ఆయన హాజరకాలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే సోము వీర్రాజుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే పార్టీ సమావేశానికి హాజరుకాలేదని చెబుతున్నారు. కానీ ఇది నిజమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సోము వీర్రాజు సమావేశాలకు హాజరుకాలేకపోయినా...కనీసం ట్విట్టర్ ద్వారా అయినా స్పందించొచ్చుగా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు సోము వీర్రాజు పార్టీని వీడబోతున్నారని, అందుకే ఆయన అజ్ఙాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. కనీసం ఈ ప్రచారంపై అయినా సోము వీర్రాజు స్పందిస్తారేమో చూడాలి.