- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరదొచ్చినా బురదొచ్చినా జగనే కారణమా?.. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడలో వరదలు(Floods) అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయుడిపై వైసీపీ నేత(YCP Leader) పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ విపత్తు(Disaster) జరిగినా దానికి జగనే కారణామా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వరదొచ్చినా, బురదొచ్చినా, ఆఖరికి ప్రపంచం(World) మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం వైఎస్ జగనే అని మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాల(Heavy Rains) గురించి తెలుసు, ఉప్పొంగుతున్న కృష్ణానదిని(Krishna River) చూస్తున్నారు. అయినా కూడా బెజవాడ మునిగేవరకు అసలు ఏ ఏ వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ప్రభుత్వానికి(Government) తెలియలేదని పోతిన మహేశ్ విమర్శించారు.
వరదకు(Floods) ముందు చేయాల్సిన పనులు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలను శాంతి పరచడానికి ఆయన రోడ్ల మీద బోటుల్లో తిరుగుతున్నారని పేర్కొన్నారు. బుడమేరు వాగును(Budameru River), దానికి వస్తున్న ఇన్‌ఫ్లోను ముందే అంచనా వేస్తే ఈ రోజు 4 లక్షల మంది ప్రజల జీవితాలు రోడ్డున పడకుండా ఉండేవని అన్నారు. అలాగే గొడుగు పట్టుకుని బుడమేరు(Budameru) కట్ట దగ్గర రీల్స్(Reels) చేసుకునే పరిస్థితి నిమ్మల రామానాయుడుగారికి రాకుండా ఉండేదని ఎద్దేవా చేశారు. క్రైసిస్ మేనేజ్మెంట్‌లో నన్ను మించిన వారు లేరని మీ మీడియాలో ఊదర గొట్టే ముందు బుడమేరు క్రైసిస్ కి కారణం మీరే అని ఎప్పుడు గ్రహిస్తారని వ్యాఖ్యానించారు. ఏదో రకంగా వైసీపీని ఇబ్బంది పెట్టాలని వరదలో(Flood) బురద ముంపులో మురికి రాజకీయం చేయాలని టీడీపీ నాయకులు(TDP Leaders) తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు.