- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ రివర్స్ గేర్..నాడు వద్దన్నారు..నేడు వదులుకోలేమంటున్నారు
దిశ వెబ్ డెస్క్: వైసిపీ లో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఐప్యాక్ సర్వే ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను నియమిస్తున్నారు. రిపోర్ట్ ఆధారంగా కొందరి నేతలను పక్కన పెడితే.. మరికొందరిని స్థానాలు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీటు రాదని తెలిసిన కొంతమంది పార్టీ నుండి ఇప్పటికే బయటకు వచ్చారు. మరి కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇదే కోవలోకి వస్తారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన శ్రీకృష్ణదేవరాయలుని రానున్న ఎన్నికల్లో గుంటూరు నియోజక వర్గానికి మార్చాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం.
నేపథ్యంలో తనకు గుంటూరు నుండి పోటీ చేయాలని లేదని తాను నరసరావుపేట నుండే పోటీ చేస్తానని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి తన అభిప్రాయాన్ని తెలియచేసారు శ్రీకృష్ణదేవరాయలు. అయితే జగన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో తాను నరసరావుపేట నియోజకవర్గం నుండి బరిలో ఉంటానని లేకపోతే రాజకీయాల నుండి తప్పకుండా అని చెప్పారు. కానీ శ్రీకృష్ణదేవరాయల మాటలను జగన్ పెడచెవిన పెట్టి పంతానికి పోయారు.
అప్పుడు పంతానికి పోయిన జగన్ ఇప్పుడు ప్రాదేహపడే స్థాయికి వచ్చారు. తాజాగా ఐప్యాక్ అందించిన సర్వే రిపోర్ట్ ఇందుకు కారణం. నరసరావుపేట టికెట్ శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తేనే వైసీపీ గెలుస్తుంది అని ఐప్యాక్ సర్వేలో తేలింది. దీనితో రివర్స్ గేర్ తీసుకున్న వైసీపీ అధిష్టానం కృష్ణ దేవరాయలకు నరసరావుపేట నియోజకవర్గం సీటు ఇచ్చేందుకు సిద్ధమైంది. జగన్ అప్పడు వద్దన్నారు.. ఇప్పుడు వదల్లేమని అంటున్నారు. అయితే జగన్ అధికార ధోరణికి అసంతృప్తి చెందిన శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తనకు ఏమి పట్టనట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఆయనను బుజ్జగించే పనిలో బిజీగా మారింది.