నా కాళ్లు పట్టుకోలేదని ప్రమాణం చేస్తావా.. మంత్రి పెద్దిరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్

by srinivas |   ( Updated:2024-04-18 14:36:16.0  )
నా కాళ్లు పట్టుకోలేదని ప్రమాణం చేస్తావా.. మంత్రి పెద్దిరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి పెద్దిరెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి వైసీపీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో పని చేస్తున్నారు. అయితే ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పాత విషయాలు బయటపెట్టుకుంటూ పరస్పరం పరువు తీసుకుంటున్నారు.

సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారని ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. తాను ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టనని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. ఈ విషయంపై తాను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. సవాల్‌ను స్వీకరించి తన కాళ్లు పట్టుకోలేదని మంత్రి పెద్దిరెడ్డి ప్రమాణం చేస్తారా అని ఛాలెంజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed