- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో దారుణం.. ఏడు కుటుంబాలను వెలి వేసిన గ్రామ పెద్దలు
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని విషయాల్లో మనుషులు వెనకబడిపోతూనే ఉన్నారు. ఇంకా కొన్నిచోట్ల వెలివేయడాలు వంటివి జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు(Police), రాజకీయ నాయకులు ఎంత అవగాహన కల్పించినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా.. ఇలాంటి ఘటనే కాకినాడ(Kakinada) జిల్లా ఉప్పుమిల్లి గ్రామం(Uppumilli Village)లో చోటుచేసుకుంది. గ్రామ పెద్దలు ఏకంగా ఏడు కుటుంబాలను వెలివేశారు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు వెళ్లకూడదని, వారిని పనులకు పిలవకూడదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ వెలివేతపై కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో బాధితుడు మేడిశెట్టి దుర్గారావు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న కాజులూరు తహసీల్దార్, గొల్లపాలెం ఎస్ఐ గ్రామానికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామ పెద్దలు, బాధితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే దిశగా రెవెన్యూ, పోలీసు అధికారులు చర్చలు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.