- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. ఆ భూముల వ్యవహరంలో కీలక తీర్పు
దిశ, వెబ్‌డెస్క్ : సినిమా ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి రామానాయుడు స్టూడియకు విశాఖలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 35 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా అదే భూమిని మరొకరికి లే అవుట్ చేసి లీజుకు ఇచ్చి గత ప్రభుత్వ ఆదేశాలను బుట్టదాఖలు చేసింది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేసును కొట్టివేసింది. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ అదే పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులో ఇరుపక్షాల వాదోపవాదాలను విని భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు చేపట్టడంపై స్టే విధించింది. అదేవిధంగా ఏపీ ప్రభుద్వానికి, ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూములు ఉపయోగించకూడదంటూ తేల్చి చెప్పింది.